Posts

Showing posts with the label భక్తి సంబంధిత నీతి కథలు

కృతజ్ఞతయొక్క మహత్తర శక్తి

Image
ఒక ఎడారిలో ఒక పక్షి ఉండేది. అది చాలా అనారోగ్యంతో, ఈకలు లేకుండా, తినడానికి తిండి, తాగడానికి నీరు మరియు ఉండటానికి గూడు లేక ఎప్పుడూ రాత్రింబవళ్లు తన జీవితాన్ని శపించుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక దేవదూత ఆ ఎడారి మీదుగా వెళ్తుండగా, ఆ పక్షి దేవదూతను ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. దానికి దేవదూత, "నేను భగవంతుడిని కలవడానికి వెళ్తున్నాను" అని బదులిచ్చింది. అప్పుడు ఆ పక్షి, "దయచేసి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో భగవంతుడిని అడిగి చెబుతారా?" అని వేడుకుంది. దేవదూత "తప్పకుండా అడుగుతాను" అని చెప్పి పక్షికి వీడ్కోలు పలికి వెళ్లిపోయింది. దేవదూత భగవంతుడి సన్నిధికి చేరుకుని, పక్షి చెప్పిన విషయాన్ని ఆయనతో పంచుకుంది. పక్షి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించి, దాని బాధలు ఎప్పుడు ముగుస్తాయని దేవుడిని అడిగింది. దానికి భగవంతుడు, "రాబోయే ఏడు జన్మల వరకు ఆ పక్షి ఇలాగే కష్టాలు అనుభవించాలి, అంతవరకు దానికి ఎలాంటి సంతోషం ఉండదు" అని బదులిచ్చారు. దేవదూత, "పక్షి ఈ విషయం వింటే చాలా నిరుత్సాహపడుతుంది, దీనికి ఏదైనా పరిష్కారం సూచించగలరా?" అని ప్రార...

ధనమా - దైవమా ?

Image
ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని మెచ్చుకోలేక పోతున్నాను, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు. “భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికి నాకు ఒకటే కోరిక! ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే, మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి. వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు..” భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా..” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజు మాత్రం చాలా పట్టుబట్టి “ఈ కోరికను తీర్చవలసిందే స్వామి” అన్నాడు....

నారాయణుడు

Image
ఒక వూరిలో ఒక అవ్వ ఎప్పుడూ - కూర్చున్నప్పుడూ, వంగినప్పుడూ, పైకి లేచినప్పుడూ కూడా "నారాయణ, నారాయణ" అంటూండేది. ఆమె మనవడు విష్ణు ఒకసారి "ఎందుకవ్వా! నువ్వు ఎప్పుడూ `నారాయణ, నారాయణ' అంటుంటావు? ఆ నారాయణుణ్ని ఓసారి నాకు చూపించు" అని అడిగాడు. "నారాయణుడు ఉన్నాడు; కానీ ఆయన మనకు కనిపించడు రా నాయనా!" అని చెప్పింది అవ్వ. "అదేంటవ్వా? దేవుడున్నాడంటావు, కానీ కనిపించడంటావు నువ్వు? ఉన్నవాడు కనిపించాలిగా మరి? ఏమో! నేను మాత్రం దేవుణ్ని చూడాల్సిందే. రేపు నన్ను తొందరగా లేపవ్వా! ఇక్కడ కనబడని దేవుడు మరెక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను నేను!" అని చెప్పి పడుకున్నాడు వాడు. మరుసటి రోజు ప్రొద్దున్నే అవ్వ విష్ణును లేపగానే, వాడు లేచి, దేవుణ్ని వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడిచీ, నడిచీ, కొంతకాలానికి అడవిని దాటి ఒక రాజ్యం చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్లి "రాజాగారూ! రాజాగారూ! నేను నారాయణుని దగ్గరకు వెళ్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. దానికి పరిష్కారం కనుక్కుని వస్తాను నేను" అన్నాడు. ఆ మాటలకు రాజుగారు "చూడు బాబూ!...

జగన్నాధ భోగం

Image
మార్వాడ దేశం లో ఒకప్పుడు ఉన్న ‘కర్మాబాయి’ అనే మహిళ పూరీ జగన్నాథ స్వామి కి మహాభక్తురాలు. ఆమె తన ఐహికమైన బరువుబాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరీ జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుని ఉండిపోయింది. నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమై పోయేది. ప్రతిరోజూ ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం, అల్లం, ఇంగువ, మరికొన్ని దినుసులతో నెయ్యి, కలిపి చేసే కిచిడీ అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యధాతథంగా ఆలయానికి పంపేది. అక్కడకూడా నివేదనమయ్యాక అర్చకులిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని తినేది. క్రమక్రంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమయిపోయింది. ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడీ పూర్తికానిదే మిగిలిన భోగాలేవీ సక్రమంగా అమరేవి కావు. మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు, అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు. అనతికాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు. ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తికలవాడు ఉండేవాడు. ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడు అని ప్రతీతి. అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురి...

నూతన యజ్ఞోపవీత ధారణ విధానము

Image
యజ్ఞోపవీతం (జంధ్యాన్ని) మార్చుకోవటానికి అవసరమైన ప్రధాన వస్తువుల జాబితా ఇక్కడ ఉంది: ముఖ్యంగా అవసరమైనవి: యజ్ఞోపవీతం (Jandhyam/Sacred Thread) – కొత్తది పసుపు (Turmeric powder) కుంకుమ (Kumkum) సామిద్దులు (Samidhalu – Havan wood sticks) వక్కలు (Betel nuts) తమలపాకులు (Betel leaves) ఆచమనం చేయటానికి నీళ్ళు (Water in a small vessel) దీపం లేదా కర్పూరం (Oil lamp or camphor) గంధం, అగరబత్తి (Sandal powder, incense sticks) ఫలాలు లేదా డ్రైఫ్రూట్స్ (Fruits or dry fruits) బెల్లమ్, చక్కెర (Jaggery, sugar) పంచపాత్రలు/పాత్రలు-2 (Vessels/plates for pooja) ఈ వస్తువులు సంప్రదాయం ప్రకారం ప్రాంతాన్ని, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి తేడా ఉంటుంది. కానీ కొత్త యజ్ఞోపవీతం (జంధ్యం), దర్భలు, చిన్న పూజా వస్తువులు, మరియు నమ్మకమైనది ముఖ్యంగా కావాల్సింది. దీపారాధన చేసిన పిమ్మట ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవా...

భగవంతునిపై నమ్మకం

Image
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏 “సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు." ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది. తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు. అప్పుడా వ్యక్తి ‘నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది ?’ అని బాధపడ్డాడు ఆ తర్వాత ‘తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని’ మనసులో భగవంతుని గట్టిగా విశ్వసించాడు. ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ భగవంతుని పట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడ...

తెలుగు పద్యరత్నాలు

Image
ఆనందంబున నర్థరాత్రములఁ జంద్రాలోకముల్ కాయగా నానా సైకత వేదికాస్థలములన్ నల్దిక్కులన్ శంభుఁ గా శీనాథున్ దరుణేందుశేఖరు శివున్ శ్రీకంఠునిన్ బాడుదు న్మేనెల్లం బులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటి లోన్. ఆ మందాకిని యా త్రివేణి వలనం బాబాహ్యకక్ష్యాస్థలం బామధ్యాంతర కక్ష్యలా విమల దివ్యజ్యోతి రుజ్జృంభణ శ్రీమద్విశ్వపతీశలింగము మదిం జింతింపఁ గాశిమహా గ్రామంబిప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారముం గైకొనువ్. కలడందురు దీనులయెడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందురన్ని దిశలను, కలడు కలండనెడివాడు కలడో లేడో ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌ "లా వొక్కింతయు లేదు ధైర్యమువిలోలంబయ్యెబ్రాణంబులున్ ఠావుల్ దప్పెనుమూర్ఛవచ్ఛెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; ...

నైమిశారణ్యం

Image
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను. ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మర...

శ్రాద్ధకర్మల ప్రాశస్త్యం

Image
తద్దినాలు పెట్టడము అవసరమా. తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని...

దేవుణ్ని చూశానమ్మా

Image
ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు . . అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు. అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు . దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది . ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు . . ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది . ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది . ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది . మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు . . సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలి...

అపార నమ్మకం

Image
త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు. ‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు. ‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ...

దేవుడి ప్రణాలిక

Image
వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో? ఒక్కరోజు...ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి నీ పనిని నేను చేస్తా" అని సవాలు విసిరాడు. దేవుడు వినీ వినీ సరేనన్నాడు. "అయితే ఒక్క షరతు, ఎవరేమన్నా నువ్వుమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదప కూడదు" అన్నాడు దేవుడు. "సరే" అన్నాడు మనోడు. ఉదయాన్నే మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. "దేవా నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు "ఒరేయ్.. పర్సు వదిలేశావు చూసుకోరా" అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. "దేవా...నా దగ్గర ఒక్కరూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. కళ్...

నైవేద్యం వెనుక పరమార్థం

Image
దేవుడు మనం పెట్టే నైవేద్యం తింటాడా...! ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు. ఆరోజు పాఠం “ ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం . పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర ...

నిశ్చల భక్తి

Image
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు.దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు. బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళ...

హనుమాన్ చాలీసా ఆవిర్భావం

Image
ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతారు. తులసీదాస్ రచించిన "రామచరితమానస" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవారు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హ...

లోక స్వభావం

Image
ఒక రాత్రి, షాపు యజమాని దుకాణం మూసివేయబోతుండగా, ఒక కుక్క లోపలికి వచ్చింది. దాని నోట్లో ఒక సంచి ఉంది. ఆ సంచిలో కొనవలసిన వస్తువుల జాబితా (లిస్ట్) మరియు డబ్బులు ఉన్నాయి. షాపు యజమాని ఆ డబ్బులు తీసుకొని, వస్తువులను సంచిలో పెట్టాడు. వెంటనే ఆ కుక్క వస్తువుల సంచిని నోటితో పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. షాపు యజమాని చాలా ఆశ్చర్యపోయి, దాని యజమాని ఎవరో తెలుసుకోవాలని ఆ కుక్క వెనుక వెళ్లాడు. ఆ కుక్క బస్టాండ్ దగ్గర బస్సు కోసం వేచి చూసింది. కొంత సమయం తర్వాత బస్సు రాగానే, కుక్క బస్సు ఎక్కింది. కండక్టర్ రాగానే, అది ముందుకు జరిగి తన మెడ పట్టీని చూపించింది. ఆ పట్టీలో డబ్బులు, ఇంటి అడ్రస్ ఉన్నాయి. కండక్టర్ డబ్బులు తీసుకుని, టిక్కెట్‌ను తిరిగి దాని మెడ పట్టీలోనే పెట్టాడు. బస్సు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, ఆ కుక్క ముందుకు వెళ్లి, తాను దిగాలనే సంకేతంగా తోక ఊపింది. బస్సు ఆగగానే అది కిందకు దిగింది. షాపు యజమాని ఇంకా దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంటికి చేరుకున్న కుక్క తన కాళ్లతో తలుపు తట్టింది. లోపలి నుండి వచ్చిన దాని యజమాని, ఒక కర్ర తీసుకుని ఆ కుక్కను కొట్టడం ప్రారంభించాడు. అది చూసి షాక్‌కు గురై...

పురోహితుని ఆశీర్వాద బలం

Image
ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది. ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు.... "ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు.కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి." జడ్జిగారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా ?" అని ప్రశ్నించారు . దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.... "నేను సంపాదించినదంతయు సక్రమమే... ఇసుమంతయు అక్రమం కాదు ." "అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు."అని జడ్జిగారు అడిగారు. "అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు. నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను. 'ఆత్మ హత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు . కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకు...

మనసెరిగిన మాధవుడు

Image
గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ? నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. ...