*చివరివరకు తప్పక చదవండి*
ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది
ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు....
"ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు.కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి."
జడ్జిగారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా లేక సక్రమంగా సంపాదించారా ?" అని ప్రశ్నించారు .
దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు....
"నేను సంపాదించినదంతయు సక్రమమే... ఇసుమంతయు అక్రమం కాదు ."
"అయితే అంత ధనాన్ని సక్రమంగా ఎలా సంపాదించావో వివరించు."అని జడ్జిగారు అడిగారు.
"అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు వచ్చారు. నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను. ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను. 'ఆత్మ హత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను. నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు .
కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి 'ఆశీర్వదించండి' అని వేడుకున్నారు.అప్పుడు నేను 'సంతాన సిద్ధిరస్తు'అని ఆశీర్వదించాను. కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి... 'నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి.'అని ప్రాధేయపడ్డారు.
దానికి నేను 'మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు .మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు.' అని ఆశీర్వదించాను.
ఆ సమయంలో ఆనందంతో వారు మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు. మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియజేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.నేను ఆదంపతులిద్దరిని 'ఆయురారోగ్య వృద్ధిరస్తు'అని ఆశీర్వదించాను.
అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.అయ్యా!ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి" అన్నారు.
పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు...
"ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు. కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతా పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోదయోగ్యమైనదే. ఆ ధనం సక్రమమైనదే. అటుపిమ్మట
కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు. అదియును సక్రమైనదే !
మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు .అది కూడా సక్రమమే.మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుకొని ఆనందంగా జీవిస్తున్నారు.
ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము." అని తీర్పు వెల్లడించారు.
ఈ సందర్భంలోనే జడ్జి గారు
ఇలా అడిగారు....
"అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్చాహంతో ఉన్నాను .వారు ఎవరో తెలుపగలరా?"
"ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే !"అని తెలియచేశారు పురోహితుల వారు.
వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.
బ్రహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది !!!
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...