అధో హరిద్రవేషు మే హరిమాణం నిదధ్మసి |
ఉదగాదయమాదిత్యో విశ్వేన సహసా సహ |
ద్విషంతం మహ్యం రంధయన్ మో అహం ద్విషతే రథమ్ ||
ఉదు త్యం జాతవేదసం దేవం వహన్తి కేతవః |
దృశే విశ్వాయ సూర్యమ్ ||
యజ్ఞోపవీతం సూర్యాయ దర్శయిత్వా |
ఆచమ్య (చే.) ||
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ మమ శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం (నూతన) యజ్ఞోపవీత ధారణం కరిష్యే ||
యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||
.
“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః ”
అని చెప్పి అని ధరించవలెను.
.
(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)
.
ద్వితీయోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని యజ్ఞోపవీత మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
తృతీయ యజ్ఞోపవీత ధారణం:
తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని యజ్ఞోపవీత మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.
.
చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.
.
తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)
గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”
.
తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.
.
జీర్ణోపవీత విసర్జనం:
తిరిగి ఆచమనం చేసి
.
శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||
.
శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం
జీర్నోపవీతం విసృజంతు తేజః ||
శ్లో: ఏతా వద్దిన పర్యంతం
బ్రహ్మత్వం ధారితం మయా
జీర్ణత్వాత్తే పరిత్యాగో
గచ్ఛ సూత్ర యథా సుఖం ||
.
విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.
తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.
.
తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.
.
నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:
జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను.
🕉 సర్వేజనా సుఖినోభవంతు 🕉
🫡జై హింద్🫡
👈Click to Share in Whatsapp
Comments
Post a Comment