శివ కుటుంబం నేర్పే జీవన పాఠం
కైలాసం చెప్పే కుటుంబ రహస్యం! ఒక్కసారి కైలాసాన్ని ఊహించండి… ఒకవైపు ఒంటినిండా భస్మం పూసుకున్న శివుడు… మరోవైపు పట్టు పీతాంబరాలు, వజ్రవైడూర్యాలతో అలంకరించుకున్న పార్వతీదేవి! శివుడి వస్త్రం వ్యాఘ్రచర్మం… పార్వతీదేవి వస్త్రం పట్టు పీతాంబరం! శివుని కంఠంలో సర్పం… జటాజూటంలో గంగ… నుదుటన మూడో కన్ను… శిరస్సున చంద్రవంక! ఇద్దరి రూపాలు వేరు… అలంకరణలు వేరు… జీవనశైలి వేరు… అయినా వారు— ఆదర్శ దంపతులు! ఇక ఆ కుటుంబంలోని వాహనాలను చూడండి… శివునికి నంది… పార్వతీదేవికి సింహం… గణేశునికి ఎలుక… కుమారస్వామికి నెమలి… ఇక్కడే అసలు ఆశ్చర్యం! సింహం కనిపిస్తే మిగతా జంతువులకు భయం… పాము కనిపిస్తే ఎలుకకు ప్రాణభయం… నెమలికి పాము సహజ శత్రువు! అంటే… కైలాసంలో ఉన్నవి ఒకదానికొకటి సరిపడే జీవులు కావు! అయినా అక్కడ యుద్ధం లేదు… ద్వేషం లేదు… “నువ్వా… నేనా?” అనే అహంకారం లేదు. ఎందుకంటే— వారి మధ్య భిన్నత్వం ఉంది… కానీ హృదయాల మధ్య దూరం లేదు! అదే శివ కుటుంబం మనకు చెప్పే అద్భుతమైన సందేశం. మన కుటుంబాల్లో మాత్రం ఏమవుతోంది? ఒక చిన్న మాట… ఒక చిన్న అపార్థం… ఆస్తిలో చిన్న వివాదం… అభిప్రాయంలో చి...