జీవిత పరమార్థం

జీవిత పరమార్థం

ఒక రాత్రి, షాపు యజమాని దుకాణం మూసివేయబోతుండగా, ఒక కుక్క లోపలికి వచ్చింది. దాని నోట్లో ఒక సంచి ఉంది. ఆ సంచిలో కొనవలసిన వస్తువుల జాబితా (లిస్ట్) మరియు డబ్బులు ఉన్నాయి. షాపు యజమాని ఆ డబ్బులు తీసుకొని, వస్తువులను సంచిలో పెట్టాడు. వెంటనే ఆ కుక్క వస్తువుల సంచిని నోటితో పట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. షాపు యజమాని చాలా ఆశ్చర్యపోయి, దాని యజమాని ఎవరో తెలుసుకోవాలని ఆ కుక్క వెనుక వెళ్లాడు. ఆ కుక్క బస్టాండ్ దగ్గర బస్సు కోసం వేచి చూసింది. కొంత సమయం తర్వాత బస్సు రాగానే, కుక్క బస్సు ఎక్కింది. కండక్టర్ రాగానే, అది ముందుకు జరిగి తన మెడ పట్టీని చూపించింది. ఆ పట్టీలో డబ్బులు, ఇంటి అడ్రస్ ఉన్నాయి. కండక్టర్ డబ్బులు తీసుకుని, టిక్కెట్‌ను తిరిగి దాని మెడ పట్టీలోనే పెట్టాడు. బస్సు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, ఆ కుక్క ముందుకు వెళ్లి, తాను దిగాలనే సంకేతంగా తోక ఊపింది. బస్సు ఆగగానే అది కిందకు దిగింది. షాపు యజమాని ఇంకా దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంటికి చేరుకున్న కుక్క తన కాళ్లతో తలుపు తట్టింది. లోపలి నుండి వచ్చిన దాని యజమాని, ఒక కర్ర తీసుకుని ఆ కుక్కను కొట్టడం ప్రారంభించాడు. అది చూసి షాక్‌కు గురైన షాపు యజమాని, "ఇంత తెలివైన కుక్కను ఎందుకు కొడుతున్నావు?" అని అడిగాడు. దానికి ఆ యజమాని, "ఇది నా నిద్రను పాడు చేసింది. వెళ్లేటప్పుడు తనతో పాటు ఇంటి తాళాలు కూడా తీసుకెళ్లవచ్చు కదా!" అని సమాధానమిచ్చాడు. కథలోని నీతి: ఇదే జీవిత సత్యం. మీ నుండి ప్రజలకు ఉండే అంచనాలకు అంతం అంటూ ఉండదు. మీరు ఒక్క చిన్న తప్పు చేసిన మరుక్షణమే, వారు మీ తప్పులను వేలెత్తి చూపించడం మొదలుపెడతారు. గతంలో మీరు చేసిన మంచి మొత్తాన్ని పూర్తిగా మర్చిపోతారు. అప్పుడు మీరు చేసిన చిన్న పొరపాటు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ లౌకిక ప్రపంచం యొక్క స్వభావం ఇలాగే ఉంటుంది...!!!
Share on WhatsApp
సేకరణ : Social Media

Comments

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు