అహల్యా బాయి హోల్కర్ - ఇండోర్ మహారాణి
మాన్య మహారాణి శ్రీమంతురాలు అఖండ సౌభాగ్యవతి అహల్యాబాయి సాహిబా, 1725వ సంవత్సరం ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక కుమారుడు ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగింది.1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు (భర్త) మృతిచెందాడు.. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్(మామగారు) అడ్డుకున్నాడు. ఆయన అహల్యా బాయికి యుధ్ధవిద్యలలో, రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్(మామగారు) , 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో ఇండోర్ పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు. పరిపాలనా సమయంలో అహల్యా బాయి సేవకు, దానధర్మాలకు మారుపేరుగా నిలిచారు. *దేవి అహల్యా బాయి హోల్కర్ - మన దేశంలో నిర్మించిన - మహమ్మదీయుల దాడులలో శిథిలమైన అనేక ఆలయాలను పునఃరుద్ధినిచిన కొన్ని దేవాలయములు* 1. అలంపూర్ (ఎంపీ) - హరిహరేశ్వర్, బతుక్, మల్హరిమార్తాండ్, సూర్య, రేణుక, రామ్ హనుమాన్ దేవాలయాలు, శ్రీరామ్ ఆలయం, లక్ష్మీ నారాయ...