Posts

Showing posts with the label భక్తి సంబంధిత యదార్థ సంఘటనలు

కృతజ్ఞతయొక్క మహత్తర శక్తి

Image
ఒక ఎడారిలో ఒక పక్షి ఉండేది. అది చాలా అనారోగ్యంతో, ఈకలు లేకుండా, తినడానికి తిండి, తాగడానికి నీరు మరియు ఉండటానికి గూడు లేక ఎప్పుడూ రాత్రింబవళ్లు తన జీవితాన్ని శపించుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక దేవదూత ఆ ఎడారి మీదుగా వెళ్తుండగా, ఆ పక్షి దేవదూతను ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. దానికి దేవదూత, "నేను భగవంతుడిని కలవడానికి వెళ్తున్నాను" అని బదులిచ్చింది. అప్పుడు ఆ పక్షి, "దయచేసి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో భగవంతుడిని అడిగి చెబుతారా?" అని వేడుకుంది. దేవదూత "తప్పకుండా అడుగుతాను" అని చెప్పి పక్షికి వీడ్కోలు పలికి వెళ్లిపోయింది. దేవదూత భగవంతుడి సన్నిధికి చేరుకుని, పక్షి చెప్పిన విషయాన్ని ఆయనతో పంచుకుంది. పక్షి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించి, దాని బాధలు ఎప్పుడు ముగుస్తాయని దేవుడిని అడిగింది. దానికి భగవంతుడు, "రాబోయే ఏడు జన్మల వరకు ఆ పక్షి ఇలాగే కష్టాలు అనుభవించాలి, అంతవరకు దానికి ఎలాంటి సంతోషం ఉండదు" అని బదులిచ్చారు. దేవదూత, "పక్షి ఈ విషయం వింటే చాలా నిరుత్సాహపడుతుంది, దీనికి ఏదైనా పరిష్కారం సూచించగలరా?" అని ప్రార...

తులసీ దళం

Image
*ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.* *అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు.* *కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.* *అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నదని.* *ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను.పూజ నేను చేయలేను,అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు.* *ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు.* *అతడితో నాయనా నేను చెప్పేవరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి...

అంతా గోపాలుడికే తెలుసు - కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల

Image
ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఒక అమ్మాయి,ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. “చదువులేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. ‘నేను నీవాడిని, నీవు నావాడివి!” అని దేవుడికి చెప్పుకొనే వాడు. అందరూ అతని మాటలకు నవ్వుకొనేవారు. అతను పట్టించుకొనేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా “నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు” అనేవాడు. కూతురికి పెళ్ళి చేయడానికి డబ్బు అవసరం అయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని, పెళ్ళి చేసి, రెండు సంవత్సరాలు కష్టపడి, డబ్బు కూడబెట్టి,అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడు అని తెలిసిన వ్యాపారి, అప్పు తీరిపోయిందని చూపే పత్రం తన దగ్గరే పెట్టుకొని, ఇంకా ఇన్ని రూపాయల అప్పు వుంది అని చెప్పే ఒక నకిలీ పత్రాన్ని తయారుచేసి దాన్ని ఇతనికి ఇచ్చిపంపాడు. నెల రోజుల తరువాత అప్పు తీర్చడంలేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేసాడు వ్యాపారి. ఇతను కోర్టు బోనులో నిలుచున్నాడు. “అప్పు తీర్చలేదా?” లాయరు ప్రశ్న. “తీర్చేసాను.” “అందుకు సాక్ష్యంగా కా...

యదార్థ సంఘటన - మహాస్వామివారిలో కామాక్షి రూపం

Image
పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది. అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు. ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ...

రిక్షా వెంకన్నకు అమ్మవారి దర్శనం - విజయవాడలో జరిగిన యదార్థ సంఘటన

Image
విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. 1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది.. విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి.. అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తోవచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు ...