తులసీ దళం
*ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.*
*అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు.*
*కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు.*
*అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నదని.*
*ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను.పూజ నేను చేయలేను,అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు.*
*ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు.*
*అతడితో నాయనా నేను చెప్పేవరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.*
*రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా, రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మొస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు.*
*ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది.ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడిగాడు. అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే*
*బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైంది.*
*ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా, ఒక్క తులసి దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా, మన సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా ! దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా.*
*బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టక్కరలేదు. ఆ దేవదేవుని కమల చరణాలపై తులసి దళం పెట్టాలన్న ఆలోచన కూడా ప్రాణాన్ని కాపాడుతుంది. భగవంతుడే భగవద్గీతలో పలికాడు.*
*పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి |*
*తదహం భక్త్యుప్రహృత్మశ్నామి ప్రయతాత్మనః ||*
*~ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్ళు భక్తితో సమర్పించినా, నేను ప్రీతితో స్వీకరించెదను అంటున్నాడు. ఈ కలియుగంలో మానవులు అశాశ్వతమని తెలిసి కూడా తీరిక లేకుండా భౌతిక సుఖాలకోసం వెంపర్లాడుతూ జీవితమును వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు.*
ఆలోచించండి!
*🙏సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు🙏*
సేకరణ : Social Media

Comments
Post a Comment