శివ కుటుంబం నేర్పే జీవన పాఠం
కైలాసం చెప్పే కుటుంబ రహస్యం!
ఒక్కసారి కైలాసాన్ని ఊహించండి…
ఒకవైపు ఒంటినిండా భస్మం పూసుకున్న శివుడు…
మరోవైపు పట్టు పీతాంబరాలు, వజ్రవైడూర్యాలతో అలంకరించుకున్న పార్వతీదేవి!
శివుడి వస్త్రం వ్యాఘ్రచర్మం…
పార్వతీదేవి వస్త్రం పట్టు పీతాంబరం!
శివుని కంఠంలో సర్పం…
జటాజూటంలో గంగ…
నుదుటన మూడో కన్ను…
శిరస్సున చంద్రవంక!
ఇద్దరి రూపాలు వేరు…
అలంకరణలు వేరు…
జీవనశైలి వేరు…
అయినా వారు—
ఆదర్శ దంపతులు!
ఇక ఆ కుటుంబంలోని వాహనాలను చూడండి…
శివునికి నంది…
పార్వతీదేవికి సింహం…
గణేశునికి ఎలుక…
కుమారస్వామికి నెమలి…
ఇక్కడే అసలు ఆశ్చర్యం!
సింహం కనిపిస్తే మిగతా జంతువులకు భయం…
పాము కనిపిస్తే ఎలుకకు ప్రాణభయం…
నెమలికి పాము సహజ శత్రువు!
అంటే…
కైలాసంలో ఉన్నవి ఒకదానికొకటి సరిపడే జీవులు కావు!
అయినా అక్కడ యుద్ధం లేదు…
ద్వేషం లేదు…
“నువ్వా… నేనా?” అనే అహంకారం లేదు.
ఎందుకంటే—
వారి మధ్య భిన్నత్వం ఉంది…
కానీ హృదయాల మధ్య దూరం లేదు!
అదే శివ కుటుంబం మనకు చెప్పే అద్భుతమైన సందేశం.
మన కుటుంబాల్లో మాత్రం ఏమవుతోంది?
ఒక చిన్న మాట…
ఒక చిన్న అపార్థం…
ఆస్తిలో చిన్న వివాదం…
అభిప్రాయంలో చిన్న భేదం…
అన్నదమ్ములు దూరమవుతున్నారు.
అక్కాచెల్లెళ్లు మాట్లాడుకోవడం మానేస్తున్నారు.
తల్లిదండ్రులు ఒకచోట…
పిల్లలు మరోచోట…
ఒకే కుటుంబం ముక్కలవుతోంది!
అందుకే మనం పూజించే శివ కుటుంబాన్ని కేవలం దేవతలుగా చూడటం కాదు…
వారి కుటుంబ జీవనం నుంచి ఒక పాఠం కూడా నేర్చుకోవాలి.
అందరూ ఒకేలా ఉండటమే కుటుంబం కాదు…
అందరూ వేర్వేరుగా ఉన్నా,
ఒకరినొకరు అర్థం చేసుకొని,
ప్రేమతో కలిసి ఉండటమే కుటుంబం!
ఇదే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చెప్పే **“కుటుంబ ప్రబోధన”**లోని ముఖ్యమైన భావం.
కుటుంబంలో కలిసి భోజనం చేద్దాం…
కలిసి పండుగలు జరుపుకుందాం…
పెద్దలను గౌరవిద్దాం…
పిల్లలకు సంస్కారాన్ని అందిద్దాం…
చిన్న చిన్న భేదాలను మాట్లాడుకొని పరిష్కరించుకుందాం…
బంధాలను తెంచుకోవడం కాదు—
బంధాలను మరింత బలపరుచుకుందాం.
ఎందుకంటే…
కుటుంబం కలిస్తే ఆనందం…
కుటుంబాలు కలిస్తే సమాజం…
సమాజం కలిస్తే శక్తిమంతమైన దేశం!
🙏 కుటుంబాలను కలుపుదాం…
బంధాలను నిలుపుదాం…
సంస్కారాలను తరతరాలకు అందిద్దాం.
*A.RAGHU RAMA SAI ,(VIZAG)*

Comments
Post a Comment