మరిన్ని కథలకోసం *www.grandhalayam.in* ని క్లిక్ చెయ్యండి
👨👦 తండ్రీ–కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. 🪁
గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి కొడుక్కి ఓపికగా నేర్పిస్తున్నాడు.
🪁 గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక
🧵 దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి.
😊 కొడుకు ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
❤️ ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పొంగిపోయింది.
కొంతసేపు దారం పట్టుకున్నాక,
🤔 కొడుకు తండ్రిని అడిగాడు –
👉 “నాన్నా… దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకు ఎగిరింది!
దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా?”
😄 తండ్రి నవ్వాడు.
👉 “దారాన్ని తెంపేద్దామా మరి?” అని అడిగాడు.
🤩 “తెంపేద్దాం నాన్నా!” అన్నాడు కొడుకు ఉత్సాహంగా.
✂️ ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేశారు.
👉 “టప్” మని దారం తెగగానే
🪁 గాలిపటం క్షణం పాటు ఇంకా పైకి ఎగిరింది…
😟 కానీ వెంటనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ
⬇️ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది.
🏠 చివరికి ఎవరో మేడపై కూలిపోయింది.
😢 “ఇలా ఎందుకు జరిగింది నాన్నా?” అని అడిగాడు కొడుకు.
నిరుత్సాహంతో తండ్రివైపు చూసాడు.
తండ్రి కొడుకును దగ్గరకు తీసుకుని చెప్పాడు –
“గాలిపటానికి దారం ఉండేది
దానిని ఎగిరిపోనీయకుండా ఆపడానికి కాదు నాన్నా…
గాలి ఎక్కువైనా, తక్కువైనా
గాలిపటం తట్టుకుని నిలబడి
ఇంకా ఇంకా పైకి ఎగరేందుకు.”
🪁 మరో గాలిపటానికి దారం కట్టి
మళ్లీ ఎగరేసి
దారాన్ని కొడుకు చేతికి ఇచ్చాడు.
జీవితం కూడా అంతే…
కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది –
“కుటుంబం అనే బంధం లేకపోతే
మనం ఇంకా ఏదో సాధించేవాళ్లం” అని.
కానీ నిజం ఏమిటంటే…
కుటుంబం ఇచ్చిన ప్రేమ,
సేవ,
సౌకర్యాల వల్లనే
మనము ఈ స్థాయిలో నిలబడి ఉన్నాం.
కుటుంబం మనల్ని పట్టుకుని లేదు…
మనల్ని నిలబెట్టే దారంలా ఉంది.
దాన్ని బంధమని అనుకుని తెంచుకునే ప్రయత్నం చేస్తే
మనమే దారి తప్పిపోతాం.
🪁 తెగిపోయిన గాలిపటంలా
గింగిరాలు తిరుగుతూ
ఎక్కడో కూలిపోతాం…
🙏 బంధాల విలువను గుర్తించండి.
కుటుంబమే మన బలమైన దారం. ❤️🪁.
Comments
Post a Comment