అద్దంలా వుండాలి

అద్దంలా వుండాలి

ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు.
ఇది గమనించిన ఒక యువకుడు…“తాతయ్యా! ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది?” అని అడిగాడు.
”నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది!.” అన్నారు తాతయ్య.
”అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త?” అన్నాడు.
”అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా!” అన్నారు తాతయ్య.
”అవునా అవి ఏంటో చెప్పండి!” అని ఆతృతగా అడిగాడు ఆయువకుడు.
“నువ్వు అద్దంలోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా?” అన్నారు.
”అవును.” అన్నాడు ఆ యువకుడు.
“ఎక్కువగానో తక్కువగానే చూపదుగా?” అన్నారు.
”అవును తాతయ్యా!” అన్నాడు.
”అద్దంలాగ నువ్వుకూడా నీస్నేహితులకు నీతోబుట్టువులకు ‘ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి!’ అని అర్థం.తప్పైతే తప్పని,ఒప్పైతే ఒప్పని, అంతే కానీ ఎక్కువతక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు!” అన్నారు.
ఇది మొదటి పాఠం!
”అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది! నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు!
అలాగే ‘ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనుక మాట్లాడకూడదు!’ అని అర్థం.
ఇది రెండవ పాఠం అన్నారు.
అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో ఆ అద్దాన్ని పగలకొట్టం కదా, అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా, ‘మనలోని లోపాన్ని సరిచేసుకోవాలి!’ అని చెబుతుంది.
ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య.
”ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్యా మీకు కృతజ్ఞతలు!” అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే ఆనందంతో అక్కడనుండి వెళ్ళాడు.
బావుంది కదా అందమైన అద్దం కథ.

Share on WhatsApp
సేకరణ : Social Media

Comments

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు