"పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోడానికి ఏకైకమార్గం ఇదే.
బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరంలో వుండే చిన్న గ్రామం.
భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే దాదాపుగా ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. 'ఈ గ్రామం చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనందనది లో
కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతీమాత ఆలయం కూడా ఉంటుంది.
(మేము దర్శించి పునీతులమైనాము)
ఈ సరస్వతినది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. "పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు: ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లుగా పెద్దపెద్ద అచ్చులున్నాయి.
ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది.
'మన' నుండి 'చట్కోలి' 8km. మార్గమధ్యలో భృగుమహర్షి ఆశ్రమం. కన్పిస్తుంది. తరువాత మాతమూర్తి ఆలయం
కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లిగాచెప్తారు.
ఈ ప్రాంతం 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
"తర్వాత కుబేర్మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నాడంటారు. "ఇక్కడినుండి 5km ప్రయాణం చేసాక
వసుధార జలపాతం వస్తుంది. ఇక్కడే అష్టవసువులు ( భీష్ముడు ఆఖరివాడు) దాదాపు 1000 సం తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ జలపాతం దాదాపు 120మీ ఎత్తునుండి
పడుతుంది.
ఇక్కడ గాలులు బలంగా వీస్తుండడం చేత ధార చాలా పలుచగా నీటి తుంపరలవలె పడుతుంది. అందుకే పాపులపై ఈ జలధార పడదు అని చెప్తారు.తర్వాత చట్మోలి (12,000 అ ఎత్తులో) అనే అందమైన పచ్చని బయళ్ళు వుండే ప్రాంతానికి
చేరుకుంటాం. పర్వతారోహకులకు ఇది ఒక విడిది ప్రదేశం.
"ఇక్కడే "సతోపంత్" మరియు భగీరధథ్ కర్క్ అనే రెండు నదులు (హిమానీనదాలు) కలిసి "అలకనంద" గా ఏర్పడతాయి. అక్కడి నుండి ముందుకు వెళితే 'ధనో
"హిమానీనదం"కు చేరుతాము. చట్మోలి నుండి లక్ష్మి వన్ 1km (12,600 అడుగుల ఎత్తు లో )తర్వాత లక్ష్మివన్ ప్రాంతంకు చేరుకుంటాం..
ఇది ఒక అందమైన రకరకాల పూలు వుండే ప్రాంతం. ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.
" ఇక్కడే లక్ష్మీవిష్ణువులు కొంతకాలం తపస్సు చేసినట్లు చెప్తారు. "ఇక్కడే ద్రౌపది దేవి తనువు చాలించింది. అని చెప్తారు.
ఇక్కడి నుండి 2km ప్రయాణించాక బంధర్
అనే ప్రాంతంకు చేరుకుంటాం. ఇక్కడే ధర్మరాజు దాహార్తి తీర్చడానికి
- అర్జునుడు బాణ ప్రయోగం చేసాడని చెప్తారు. "బంధర్ నుండి సహస్రధార 4km (14,000 అడుగుల ఎత్తులో):
"సహస్ర ధార నుండి చక్ర తీర్ధం 5km
(15,000 అడుగుల ఎత్తులో)
చక్రతీర్థం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని కింద పెట్టడం వలన ఏర్పడిన సరస్సుగా . చెప్తారు. "ఇక్కడే అర్జునుడు తనువు చాలించాడని చెప్తారు. చక్రతీర్ధం నుండి సతోపంత్ 5km:
"ఈ "సతోపంత్" అనేది త్రిభుజా కృతి లో వుండే సరస్సు. ఇది 5 పర్వతాల మధ్య వుండే సుందరమైన స్వచ్చమైన నీరు ఉండే
సరస్సు.. ఇక్కడే ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తారని గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారని చెప్తారు. ఏకాదశి రోజున ఇక్కడ పక్షుల సమూహాన్ని చూడవచ్చు. ఇక్కడే
భీముడు తనువు చాలించాడని చెప్తారు. సతోపంత్ నుండి స్వర్గారోహిణం 8 km:
• ఈ మార్గం బహు కష్టంగాను ప్రయాణానికి దుస్సహం గాను చెప్తారు. మార్గంలో చంద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సులు
ఉంటాయి.
ఇక్కడినుండే ధర్మరాజు మాత్రమే ఒక కుక్క తోడురాగా స్వర్గానికి ప్రయాణించాడు.
" నిజానికి "స్వర్గారోహిణి అనేది
6 పర్వతాల సమూహం గా చెప్తారు. ఇందులో స్వర్గారోహిణి 1 అనేది ముఖ్యమైంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలోని ఘర్వాల్ హిమాలయ ప్రాంతానికి చెందినది.
దీనికి పడమర వైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది.
ఈ స్వర్గారోహిణి పర్వతాగ్రం (20512 అ ఎత్తు లో, 6252 m) మబ్బులలో ఉంటుందని అది
3 మెట్లు వలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో 4 మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకివెళితే స్వర్గముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు.
శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...