నిజమైన స్నేహం
నిజమైన స్నేహం
మనసుని తాకే ఈ కథను తప్పకుండా చదవండి my dear ఫ్రెండ్స్!!SSC వరకు కలిసి చదువుకున్న నలుగురు మిత్రులు
SSC ఎగ్జామ్ అయ్యాక హోటల్ కి వెళ్లి టీ, బ్రేక్ ఫాస్ట్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు.
అది ఆదివారం, సైకిల్ మీద హోటల్ చేరుకున్నారు.
టీ, అల్పాహారం చేస్తూ దినేష్, సంతోష్, మనీష్, ప్రవీణ్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు..
యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ఏప్రిల్ 04 న ఈ హోటల్‌లో కలుద్దామని నలుగురూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు..
అప్పటి వరకు మనమందరం చాలా కష్టపడాలి, మంచి స్థాయికి రావాలి
అప్పటి వరకు ఆ నలుగురు స్నేహితులకు టీ, బ్రేక్‌ఫాస్ట్ అందించిన వెయిటర్ రాజు ఇదంతా విని,
sir
నేనూ ఇక్కడే ఉంటే గనక మీ అందరి కోసం ఈ హోటల్‌లో వేచి ఉంటాను అన్నాడు
నలుగురూ తదుపరి విద్య కోసం విడిపోయారు...!
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి..
యాభై ఏళ్లలో ఆ నగరంలో సమూల మార్పులు వచ్చాయి, నగర జనాభా పెరిగింది, రోడ్లు, ఫ్లై ఓవర్లు, మెట్రోలు నగర రూపురేఖలే మారిపోయాయి
ఇప్పుడు ఆ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్‌గా మారిపోయింది, వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్‌కే యజమాని అయ్యాడు..
యాభై ఏళ్ల తర్వాత, నిర్ణీత తేదీ ఏప్రిల్ 04 మధ్యాహ్నం, హోటల్ డోర్ వద్దకు విలాసవంతమైన కారు వచ్చి ఆగింది..
దినేష్ ఆ కారు దిగి వరండా వైపు నడవడం మొదలుపెట్టాడు, దినేష్ కి ఇప్పుడు మూడు జ్యువెలరీ షోరూంలు ఉన్నాయి..
ప్రవీణ్ సర్ మీ కోసం ఒక నెల క్రితమే టేబుల్ బుక్ చేసారని రాజు చెప్పాడు..
ఒక గంటలో సంతోష్ వచ్చాడు, సంతోష్ ఆ నగరంలో పెద్ద బిల్డర్ అయ్యాడు..
దినేష్, సంతోష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ వేరే స్నేహితుల కోసం ఎదురుచూస్తుంటే, మూడో స్నేహితుడు మనీష్ అరగంటలో వచ్చి వారితో కలిసాడు..
అతనితో మాట్లాడిన తర్వాత మనీష్ వ్యాపారవేత్త అయ్యాడని దినేష్, సంతోష్ కి తెలిసింది.
స్నేహితులు ముగ్గురి చూపులు పదే పదే డోర్ వైపే వెళ్తున్నాయి, ప్రవీణ్ ఎప్పుడు వస్తాడా అని.?
ముగ్గురూ యాభై ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంది..
గంటల తరబడి వారి సంభాషణ సాగినా ప్రవీణ్ రాలేదు..
బిల్లు అడిగిన వెంటనే ఆన్‌లైన్‌లో బిల్లు కట్టినట్లు ముగ్గురికి సమాధానం వచ్చింది..
సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో ఓ యువకుడు కారు దిగి, బయలుదేరేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల వద్దకు వచ్చాడు, ముగ్గురూ ఆ వ్యక్తిని చూస్తూ ఉండిపోయారు..
యువకుడు నేను మీ స్నేహితుడి కొడుకు రవిని, మా నాన్న పేరు ప్రవీణ్ అని చెప్పడం మొదలుపెట్టాడు.
ఈ రోజు మీ రాక గురించి నాన్న చెప్పారు, ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, కారణం గత నెలలో తీవ్ర అనారోగ్యంతో మా నాన్న గారు చనిపోయారు..
మా నాన్న చనిపోయే ముందు నాతో ఇలా అన్నారు నేను ఈ లోకంలో లేనని తెలిసినప్పుడు నా స్నేహితులు ఆనందంగా గడపలేరు ఒకరినొకరు కలుసుకున్న ఆనందం కోల్పోతారు
అందుకే నన్ను ఈ రోజు హోటల్ కి ఆలస్యంగా వెళ్ళమని కోరారు..
ఆయన తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా కోరారు అని రవి తన రెండు చేతులు చాచి వారిని ఎంతో ఆప్యాయంగా కౌగలించుకొన్నాడు...
చుట్టుపక్కల వారు ఆ దృశ్యాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ, ఆ యువకుడిని ఎక్కడో చూసినట్లు ఉన్నదని అనుకున్నారు
మా నాన్న టీచర్ అయ్యారు, నన్ను మాత్రం కలెక్టరు చదివించడానికి ఎంతో కష్టపడ్డారు.. ఈరోజు నేను ఈ నగరానికి కలెక్టర్‌ని...!
అని రవి చెపుతుంటే విని అందరూ ఆశ్చర్యపోయారు.
కళ్ళవెంట వస్తున్న దుఃఖాన్ని తమలోనే దిగమింగుతూ మంచి స్నేహితుడిని కోల్పోయామే అనే భాదతో ఆ ముగ్గురు స్నేహితులు వెనుదిరిగారు..
అందుకే బంధువులతోను స్నేహితులతో కలుస్తూనే ఉండండి, ఏళ్ల తరబడి వేచి ఉండకండి, ఎవరి వంతు ఎపుడు వస్తుందో తెలియదు
మీ కుటుంబం మరియు స్నేహితులలో కలసి మెలసి ఉండండి, జీవించి నంత కాలం ఆ ఆనందాన్ని అనుభవించండి..
అన్నింటికంటే ముఖ్యంగా మన తోబుట్టువులు, మన పూర్వీకులు, మన బందువులు, మన అమ్మ, నాన్న వైపు ఉన్న వారిని, అసలు మరిచిపోకూడదు. మన గురించి సంతోషం ఐనా, కష్టం ఐనా...... వారు చూస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లలకు ఇవి నేర్పించాలి కదా
*🙏సర్వే జన... మిత్రులారా సుఖినో భవంతు*...🙏🙏🙏
సేకరణ : Social Media

Comments
Post a Comment