ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి సేద తీరుతాడు.
వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేసారు.అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు .
రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు.
అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు. వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలు పెట్టాడు.
ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు. బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిదుర పోతాడు అని చెప్పాడు .
అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి.
అదెందుకు అని అడిగాడు రాజు.
బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది .పక్షులేవైనా వస్తే ఈ కట్టె కు కట్టిన నల్లగుడ్డ ఊపితే అవి వెళ్లిపోతాయి అని బదులిచ్చాడు ఆ వ్యక్తి .
ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి
ఇంట్లో ఎలుకలు బెడద ఎక్కువగా ఉంది. అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు.
ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి.
వాళ్ళు ఎవరు అని అడిగారు ??
పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు. అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్లకు నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు .
రాజు మళ్ళీ సందేహంగా ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా అని అడిగారు. అందుకు ఆ వ్యక్తి
నేర్చుకుంటున్నది నోటితోనే... కాళ్ళు ఊరకనే ఉంటాయి కదండి! పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతుంటారు అని బదులిచ్చాడు .
రాజుకి చాల ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని !!
అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టి వెళ్తుంది. అన్ని అయ్యాక అవి నేర్చుకుంటుంటాను అని బదులిచ్చాడు .
రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని .
సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావటానికి.
నేర్చుకోవాలి అనే జిజ్ఞాస, సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉంటే మనిషికి ఏదైనా సాధ్యమే. 🙏🏻💐🇮🇳.
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...