Image

సత్సంగత్వే

ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు, ఎర దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ ఆ పేదవాడు కలత చెందుతున్నాడని అతని పై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది. వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది. కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు, ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది. అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను చంపేసాడు. హంస కింద పడి చనిపోతూ, ఇలా అన్నది... నేను నీకు సేవ చేస్తున్నాను, నీకు నీడ ఇస్తున్నాను, నీవు నన్ను చంపావు.. ఇందులో నా తప్పు ఏమిటి.. అని. అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు... నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది. అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సoగత్యం లోనే వుండమని... 🥀🥀🥀🥀🥀🥀 ఆది శంకరుల వారు తను రచించిన "భజగోవిందం" లో ఇలా అంటారు... సత్సంగత్వే నిః సఙ్గత్వం నిఃసఙ్గత్వే నిర్మోహత్వం | నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును. 🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

👈Click to Share in Whatsapp
గ్రంథాలయం

సేకరణ : Social Media

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు