Image

పారాయణం - ప్రాముఖ్యత

పారాయణం చేయడంలో ఇతర గ్రంధాలకు , భాగవతానికి తేడా ఉంది .దీన్ని పఠించడం వల్ల ఐహిక (ఈలోకం )ఆముష్మిక (పరలోకం ) ప్రయోజనాలు నెరవేరతాయి .ధార్మిక ప్రగతి ఏర్పడుతుంది .నీటిని పీల్చుకున్న ఇసుక తడిగా మారినా ,పైకి మామూలుగానే కనిపిస్తుంది . పరీక్షించి చూస్తే తడిసిన విషయం తెలుస్తుంది . ఆలాగే భాగవత పారాయణం పూర్తయ్యేసరికి , మనిషి పైకి మమూలుగా ఉన్నా అంతరాంతరాల్లో అధ్యాత్మిక పరిణితి కలిగినవాడవుతాడు . ఏవైనా విఘ్నాలు ,ఏర్పడితే గజేంద్ర మోక్షం , రుక్మిణీ కళ్యాణం పారాయణం చేస్తారు .అవి పూర్తయ్యేసరికీ వారిలో ధైర్యం ,ఆత్మస్థైర్యం పెంపొందుతాయి .అవరోధాల్ని ఎదుర్కొనే తెలివితేటలతో పాటు లోకజ్ఞానం అలవడుతుంది అంబరీష ,ధ్రువ ఉపాఖ్యానాలు ,ప్రహ్లాద చరిత్ర వంటి అనేక ఘట్టాల్ని పలు కోరికలతో పారాయణ చేస్తారు .ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తారు .ఏ ప్రయోజనమూ ఆశించకుండా భాగవతాన్ని ఏడు రోజులల్లో పారాయణ చేయాలన్న నియమమం ఉంది .దీన్ని " భాగవత సప్తాహం "అని పిలుస్తారు పరీక్షిత్తులోని మృత్యుభయం ,ఆందోళన పోగొట్టడానికి శుక మహార్షి భాగవత కథల్ని వారం రోజుల్లో చెప్పి పూర్తిచేస్తాడు .అది విన్న పరీక్షిత్తు మృత్యువును జయించిన అనుభూతి పొందుతాడు .భయం తొలగి ప్రశాంతచిత్తుడవుతాడు .ఆ కథల్లో మాయామోహాలు నశింపచేసే అంశాలు ఉండటమే అందుకు కారణం .అప్పటినుంచే భాగవతాన్ని చదవటం ఏడు రోజులలో పూర్తిచేయాలన్న నియమము వచ్చిందంటారు . సప్తాహం అని పదానికి కొందరు మరొక అర్ధమూ చెబుతారు .అదివారం మొదలు శనివారం వరకు వారానికి ఏడు రోజులు .అన్ని రోజులూ ఏనాడూ ఆగకుండా జీవితాంతం నిత్య పారాయణ చేస్తునే ఉండాలంటారు .మాయా మోహాలు ఐహిక వాంఛలు నశిస్తాయన్నదే అందులోని ఆంతర్యం .

👈Click to Share in Whatsapp
గ్రంథాలయం

సేకరణ : Social Media

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు