కాయాపేక్ష, ఫలా పేక్ష

తులసీ దళం

కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి వాటిని తినడం మానేస్తాం.పైగా
"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో వదిలేశాను "
"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను అని చెప్పుకుంటాం.
నిజానికి పెద్దలు వదలమన్నది, కాయాపేక్ష, ఫలా పేక్ష వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.
కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి , ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ వదిలేసి సాధువులా బతకమని అర్ధం.
ఫలాపేక్ష అంటే :- ఏదైనా పని చేసి దాని ధ్వారా లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.
ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం. యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం. బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం. ఓం నమః శివాయ 🌹🌹🌹
Share on WhatsApp
సేకరణ : Social Media

Comments

Popular Posts

తద్దినం ప్రాముఖ్యత

పరోపకారం గురించి ఒక చిన్న కథ

తెలుగు పద్యరత్నాలు