*తప్పకుండా చదవండి*
🌀 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు.
🌀 ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.
🌀 నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు నేను అన్నది పోలేదన్నమాట...
🌀 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది కాని అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు...
🌀 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...
🌀 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..
🌀 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేరు..
🌀 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..
🌀 మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు,అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది.
ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...
🌀 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...
🌀 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం..
🌀 మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...
🌀అతివేగం ప్రమాదాలకు దారితీస్తుంది..అలాగే అన్నీ అనారోగ్యసమస్యలు వేగంగా తగ్గిపోవాలని వాడే మందుల వల్ల వచ్చే ప్రమాదాలే సైడ్ ఎఫెక్ట్స్.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
💐 ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. ‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు. 💐 ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. 💐 ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్’’ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 💐 ఈ సంఘటన జరిగిన మూడు రోజుల త...
*ఒక అద్భుతమైన కథ*. రాత్రి చీకటి పడుతోంది. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని నసిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కా...