🟢🟢🔵🔵
భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.
ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు.
“హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”
“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".
“పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేదనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్ సీరియస్‌గా.
స్వామీజీ చిన్నగా నవ్వి .....
“అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”
ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు.
నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు.
వలలో చేపలు పడ్డాక, వాటిని పట్బకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.
“జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా? లేక దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.
“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్ వినమ్రంగా.
“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.
గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.
గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||.
☘️🍁🌸☘️🍁🌸☘️🍁🌸🏵️
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...