దేహతాదాత్మ్యము....
ఒక పట్టణంలో ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. అతడు జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కుతాడు. అతడు శిల్పాలను చెక్కితే అది శిల్పంలాగా కాక ఆ మనిషే అక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆయనకు ముసలితనం వచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు చావు తప్పదు అని అతడికి తెలుసు. అయినప్పటికి చావును తప్పించుకోవాలనుకొని ఒక ఆలోచన చేశాడు. రూపం, రంగు, ఒడ్డు, పొడుగు, డ్రెస్ అన్నీ తనలాగే అచ్చు గ్రుద్దినట్లుగా ఉండే 9 శిల్పాలను తయారుచేశాడు. వాటిని చూసిన వారెవరైనా వాటిని శిల్పాలు అని అనుకోరు. ఆ శిల్పియే అనుకుంటారు. ఆ తొమ్మిదింటిని జాగ్రత్తగా దాచిపెట్టాడు. కొంతకాలం గడిచింది.
అతడికి జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్షించి ఇక ఎంతోకాలం జీవించటం జరగదు. బహుశా రెండు మూడు గంటలు మాత్రమే అని చెప్పారు. అప్పుడా శిల్పి తన ఇంటి బయట 9 శిల్పాలను పరుండబెట్టి అన్నింటిపై ఒకేరకం వస్త్రాన్ని కప్పి, తాను కూడా వాటి మధ్య పడుకొని అదే రకం వస్త్రాన్ని కప్పుకున్నాడు. మరణ సమయం ఆసన్నమైంది. యమధర్మరాజు చేత పాశాన్ని ధరించి ఆ శిల్పి కోసం వచ్చాడు. అయితే అక్కడ 10 మంది శిల్పులు పరుండినట్లు గమనించాడు. ఒక్కొక్క శిల్పం మీద వస్త్రాన్ని తొలగించి చూస్తుంటే అందరూ ఒక్కటిగానే ఉన్నారు. ఇందులో ఆయుష్షు తీరిపోయిన శిల్పి ఎవరా? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆయనకు బోధ పడటం లేదు.
ఒకరికి బదులు మరొకరి మెడలో పాశాన్ని వేయటం తన వృత్తి ధర్మానికే కళంకం. తనకున్న 'సమవర్తి' అనే పేరు తొలగిపోతుంది. అందువల్ల అందరినీ మరొకసారి పరికించి చూచి తిరిగివెళుతూ వెళుతూ "వీడెవడో గాని అన్నింటిని ఎంతో నైపుణ్యంతో, జీవకళ ఉట్టి పడేటట్లుగా చక్కగా చెక్కాడు గాని ఒక్క పొరపాటు చేశాడు" అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినటంతోనే విగ్రహాల మధ్య పడుకున్న శిల్పి అమాంతంగా లేచి "ఏమిటయ్యా.. ఆ పొరబాటు..?" అన్నాడు. "..నీవు లేవటమే ఆ పొరపాటు" అని యమధర్మరాజు.. అతడి మెడలో యమపాశాన్ని వేసి ప్రాణాలు గైకొని పోయాడు. ఆ శిల్పి కొద్దిసేపు ఆగితే ప్రాణాలు దక్కేవి. కాని దేహాభిమానం అతణ్ణి వీడలేదు. నేను ఇంతటి గొప్ప శిల్పినే.. నేనేం పొరపాటు చేశాను..? అనే అభిమానం పొడుచుకు వచ్చింది. లేచాడు. పొయ్యాడు. దేహాభిమానమే అతడి కొంప ముంచింది, అతడి ప్రాణాలు తీసింది.
దేహాభిమానం గలవారు 'ఈ దేహమే నేను' అనే భావంతో ‘నేను’ 'నేను' అనే అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ దేహానికి సంబంధించిన వారిని 'నావారు' అని, ఈ దేహానికి సంబంధించిన వాటిని 'నావి' అనే మమకారాన్ని కలిగి ఉంటారు. ఈ అహంకార మమకారాల కారణంగానే జీవితంలో ప్రశాంతతను పోగొట్టుకొని, మనస్సును అనవసరమైన ఆందోళనలకు, ఉద్రేకాలకు లోనుగావించుకొని అశాంతిని, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. లోకంలో సాధారణంగా అందరూ ఈ అహంకార మమకారాలకు లోనవుతూనే ఉంటారు. అందుకే నిర్గుణోపాసన అనేది కష్టతరమవుతున్నది. ఈ "దేహతాదాత్మ్యమే మానవులు కున్న పెద్దదోషం".
ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించిన అనేక మంది సాధకులు జపధ్యానాదులు, ఉపాసనలు చేస్తున్నప్పటికీ మంచి ఫలితాన్ని పొందలేక పోవటానికి కారణం ఈ దేహాభిమానమే.. దేహతాదాత్మ్యమే... దేహమే నేను అని భావించే అహంకారమే. క్షేత్రాన్ని శుద్ధం చేయకుండా.. పొలాన్ని సరిగ్గా దున్ని తయారు చేయకుండా విత్తనాలు చల్లితే ఏం ప్రయోజనం.. పునాది గట్టిగా వేయకుండా ఎన్ని అంతస్థుల మేడ కడితే అది ఎంతకాలం ఉంటుంది.. అలాగే అంతరంగం లోని దేహాభిమానం తొలగకుండా పరమాత్మయందు మనస్సు నిలుపుదాం అని ప్రయత్నిస్తే నిలుస్తుందా..? నిలవదు. కనుక ముందుగా దేహాభిమానాన్ని వదలాలి. ఆ దోషం తొలిగితే గాని నిర్గుణోపాసన కుదరదు...
|| ఓం శ్రీ మాత్రే నమః ||
తద్దినాలు పెట్టడము అవసరమా తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. నిజము. నిజము. నిజము. నమ్మండి. అందరికీ చెప్పండి. వంశములను కాపాడండి.పితృ దేవతలు సంతోష పడక పోతే వంశాభివృద్ధి జరగదు. మగ పిల్లలు పుట్టరు. వంశము ఆగి పోతుంది. అందరు తెలుసుకొని, జాగ్రత్తగా, పద్ధతిగా, శాస్త్ర ప్రకారముగా విధిగా ఆచరించాలి. దీని మడి వేరు. తడి బట్ట తోనే వంట చేసి, బ్రాహ్మణులకు భోజనము వడ్డించాలి. పొడి బట్ట పనికి రాదు. ముందు రోజు రాత్రి, ఆ రోజు రాత్రి భోజనము చేయకూడదు, బ్రహ్మ చర్యము పాటించి నేల మీద భార్యా భర్తలు పరుండాలి, భక్తితో, శ్రద్ధతో శ్రాద్ధము పెట్టాలి. ఇంటి కోడలు వంట చేస్తే పితృ దేవతలు శ్రీఘ్రముగా అనుగ్రహిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని క...
🌸పరోపకారం గురించి ఒక చిన్న కథ🌸 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు ... ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా? అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ. శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు. మొదట ఇదేదో అద్భుతమైన కల అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ...